download
ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి - సిపిఎం డిమాండ్
Vikarabad

ఇండ్ల నిర్మాణంలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలి - సిపిఎం డిమాండ్

Tuesday, 14 July 20269 views

వికారాబాద్, వీక్షణ న్యూస్ : సోమవారం సిపిఎం పార్టీ తరఫున వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పరిధిలో రామయ్యగూడ రాజీవ్ గృహకల్పలో 40, 60 గజాలలో అక్రమార్కులు ఇండ్లు నిర్మిస్తున్న విధానం పై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ మండల తహసిల్దార్ కు మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మైపాల్ మాట్లాడుతూ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 290, 291, 292లో,190, 121లో, బిళ్ళ దళాలలో సర్టిఫికెట్ ఇచిన వారికి పొజిషన్ ఇవ్వాలని తెలిపారు. రామాయగూడలో ప్రభుత్వ భూమిలో 40 నుండి 60 గజాల స్థలం ప్రభుత్వం 2007 సంవత్సరంలో పేదలకు పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఈ భూమిపై కోర్టులో కేసు కొనసాగుతుంది 30 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోర్టులో కేసు ఉండంగా అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు రాత్రి రాత్రికె నిర్మాణాపనులు కొనసాగుతున్నాయి, .మున్సిపల్ పరిధిలో ఉన్న అధికారులు మండల రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్స్ పరిశీలించకుండా అనుమతులు ఇస్తున్నారని తెలిపారు. నిజమైన లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించి వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సర్టిఫికెట్లు ఫైలు ఆఫీసులో లేవని ఆరోపించారు. ఆఫీసులలో ఎక్కడ ఉన్నా వెతికి తీయాలని కోరారు. సర్వేనెంబర్ 190, 121, 290, 291, 292లో బిళ్ళ దాఖలలో సర్టిఫికెట్స్ ఇచ్చిన పేదలకు పొజిషన్ వెంటనే ఇవ్వాలి. లేనిచో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కబ్జాలు చేసి పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుదర్శన్, నాయకులు శ్రీను, సతీష్, శ్రీనివాస్, రమేష్, ఎండి హజారుఖాన్, ఎండి నజీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this article

Related Articles