download
 అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి
Vikarabad

అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలి

Tuesday, 14 July 202615 views

ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీ డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నాడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నాను ఉద్దేశించి టిడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు టి. రాంచందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల దీర్ఘకాలికంగా పెండింగ్‌‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వికారాబాద్ జిల్లాలో వర్కంగ్‌ ‌జర్నలిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారని ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్ష‍ేమం కోసం కృషిచేస్తున్నారని ఎండనక, వాననక విధుల్లో ఉంటున్నారని తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడారని ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారని పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వాల విధానాలు మారిపోతున్నాయి. కానీ జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని ఉన్న రెండు వర్కింగ్‌ ‌జర్నలిస్టు చట్టాలను యూనియన్‌ ‌గవర్నమెంట్‌ ‌కోడ్‌ల ‌కింద మార్చేసి హక్కులను కాలరాసిందని కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని అటు యూనియన్‌ ‌ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్ష‍ేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదని చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రిడిటేషన్‌ ‌కార్డులు సైతం సకాలంలో ఇవ్వడం లేదని అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రిడిటేషన్‌ ‌కార్డులు జారీచేస్తున్నారని అర్హులైన వారందరికి ఇవ్వాలనేది తెలంగాణ వర్కింగ్‌ ‌జర్నలిస్ట్స్‌ ‌ఫెడరేషన్‌(‌టీడబ్ల్యూజేఎఫ్‌) ‌ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. జిల్లా కార్యదర్శి ఎండి షఫీ మాట్లాడుతూ ప్రుభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్‌‌కార్డులిచ్చి ఆదుకోవాలని గత 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ జర్నలిస్టులకు ఇండ్త స్థలాలు ఇవ్వలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌‌రెడ్డి ఇచ్చిన హామీని త్వరితగతిన అమలుచేయాలని జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసులు ఉచితంగా ఇవ్వాలని అలాగే కొత్తగా మెట్రో పాసులను ఉచితంగా జారీచేయాలని ఇకపోతే కరోనాకు ముందు జర్నలిస్టులకు ఉన్న రైల్వే పాసుల సౌకర్యాన్ని యూనియన్‌ ‌ప్రభుత్వం రద్దుచేసిందని దీన్ని పునరుద్ధరించేలా మోడీ సర్కార్‌‌పై ఒత్తిడి తేవాలని ఈ సమస్యలను వెంటనే స్పందించి సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు: 1. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ ‌కార్డులను త్వరితగతిన జారీచేయాలి. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకూ కార్డు ఇవ్వాలి. 2. ఒకే యూనియన్‌ ‌నుంచి ప్రాతినిథ్యం వహించే వారిని అక్రిడిటేషన్‌ ‌కమిటీల నుంచి తొలగించాలి. అందరికి సమాన ప్రాతినిథ్యం కల్పించాలి. జర్నరలిస్టులకు న్యాయం జరిగేలా చూడాలి. 3. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నరలిస్టుకూ హెల్త్‌‌కార్డులివ్వాలి. కంట్రిబూషన్‌‌ను ప్రభుత్వమే జర్నలిస్టుల తరపున చెల్లించాలి. 4. సీఎం రేవంత్‌‌రెడ్గి ఇచ్చిన హామీ మేరకు ఇండ్లస్థలాలు వెంటనే ఇవ్వాలి. యుద్ధప్రాతిపదికన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. 5. రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే ప్రదేశం నుంచి ఇంటి వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. 6. జర్నలిస్టులకు ఉచితంగా ఆర్టీసీ, మెట్రో పాసులను అందజేయాలి. 7. రైల్వే పాసుల పునరుద్ధరణ కోసం మోడీ సర్కార్‌‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ మాసాని వెంకటయ్య, కోశాధికారి ప్రశాంత్, ఉపాధ్యక్షులు హఫీజ్, భీమ్ శాప్ప, సి శ్రీనివాస్, అనంతయ్య, మురళి గుప్త, కృష్ణ, ఉదయ్, కార్యదర్శులు ఏ. ఆనంద్, ఎజాజ్, జి శ్రీనివాస్, కృష్ణ, అరుణ్ రెడ్డి, నాగిరెడ్డి, జగన్, శ్రీకాంత్, రాకేష్, సంతోష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Share this article

Related Articles