
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి-కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్, వీక్షణ న్యూస్ : ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్ ను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. మంగళవారం పరిగి నియోజకవర్గం చౌడాపూర్ మండలంలో తహసిల్దార్ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, మరికల్ గ్రామంలో ఆయిల్ ఫామ్ పంట సాగును జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మిక పర్యటన గావించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే విధంగా బిఎల్ఓ లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి తీసుకునే క్రమంలో ఫారాలు పూరించడంలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాల్సిన బాధ్యత బిఎల్ఓ లపై ఉందని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని అదేవిధంగా మందులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్యాధికారి సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్తపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థుల పడక గదులను, టాయిలెట్లు, మధ్యాహ్న భోజన వంటకాలను కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. మరికల్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగును పరిశీలించారు. ఆయిల్ ఫామ్ సాగు అధిక లాభాలు ఉంటాయని, ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. కలెక్టర్ తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, జెడ్పి సీఈఓ సుదీర్, డిఎంహెచ్ఓ సుధాకర్ లాల్ లు ఉన్నారు.
Share this article


